![]() |
![]() |

బిగ్ బాస్ అగ్నిపరీక్షకు మంచి కంటెంట్ ఇచ్చే కామన్ మ్యాన్ చాలా మంది ఎంట్రీ ఇస్తున్నారు. ఇక నల్గొండ నుంచి కేతమ్మ వచ్చింది. మేము గౌడంగలం..నేను కల్లు, ముంజెలు అమ్మాను. అనేసరికి మా కోసం కల్లు తెచ్చావా అని శ్రీముఖి అడిగింది. అమ్మ లేదు నాన్న లేడు. నేను పుట్టిన రెండు నెలలకు అమ్మ చచ్చిపోయింది. తాత, అమ్మమ్మ సాదారు నన్ను. గంతకు తగ్గ బొంత అన్నారు ఒక దిక్కు లేని వాడికి ఇచ్చి పెళ్లి చేశారు. నన్ను బెజవాడకు తీసుకుపోయాడు. పెద్ద పాప కడుపులో పడ్డాక అప్పుల బాధ. నాట్లు వేయడానికి వెళ్ళా...పిల్లకు పాలు ఇచ్చాక నాకు తాగడానికి గంజి కూడా ఉండేది కాదు. నేను పడని కష్టం లేదు.
హైదరాబాద్ వచ్చాము. వాచ్ మ్యాన్ ఉద్యోగం చేశా. ఆ దేవుడి దయతో ఒక 200 గజాలు కొనుక్కున్న. నా భర్తకు పక్షవాతం వచ్చింది..కానీ బిగ్ బాస్ నుంచి మంచి అవకాశం వచ్చింది" అంది. "బిగ్ బాస్ హౌస్ లో ఉండలేవు కేతమ్మ..నువ్వు భోళా మనిషివి.." అన్నాడు నవదీప్..ఆమెకు రెడ్ సిగ్నల్ ఇచ్చాడు. బిందు మాధవి కూడా రెడ్ ఇచ్చింది. "మా సీజన్ లో గంగవ్వ అనే పెద్దావిడ వచ్చారు. ఆమెకు బిగ్ బాస్ హౌస్ సరిపడక బయటకు వచ్చేసారు" అని అభిజిత్ చెప్పాడు. "కానీ నేను ఎంత చేయాలో అంత చేయగలను" అని చెప్పింది కేతమ్మ. దాంతో అభిజిత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతానికి నిన్ను హోల్డ్ లో పెడుతున్నాం అని చెప్పింది శ్రీముఖి.
![]() |
![]() |